భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్లో ఉండే మజాను మరోసారి అస్వాధించారు అభిమానులు. స్వల్ప స్కోర్లు నమోదైన మ్కాచ్లో ఇరుజట్లు గెలుపుకోసం చివరి ఓవర్ వరకూ పోరాడాయి. ఓవైపు చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉండటం.. కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఔటవడంతో భారత్ అభిమానుల్లో టెన్షన్.. మరోవైపు పొదుపైన బౌలింగ్ తో కట్టడి చేస్తున్న ప్రత్యర్థి ఆటగాళ్లు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన కుంగ్ ఫూ పాండ్యా ధనా ధన్ బ్యాటింగ్ మెరుపులు మెరిపించి భారత్ నూ విజయతీరాలకు చేర్చాడు. దీంతో భారత్ ట్వీ 20 వరల్డ్ కప్ ఓటమికి బదులు తీర్చుకున్నట్లు అయ్యింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దాయాది జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. రిజ్వాన్ (43) టాప్ స్కోరర్. బౌలింగ్ లో పాండ్య (3/25), భువనేశ్వర్ (4/26) విజృంభించారు. అనంతరం 148 పరుగుల లక్ష్య చేధనకు దిగిన భారత్.. 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది.
కెరీర్ లో 100 వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ (34) విలువైన పరుగులు చేశాడు. జడేజా (29) విలువైన పరుగుల సాధిస్తే.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హార్థిక్ (33) పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
ఇక ఆసియా కప్ తొలి మ్యాచ్ లో శుభారంభం చేసిన భారత జట్టు.. తమ తదుపరి మ్యాచ్ హాంకాంగ్ తో తలపడనుంది. ఇక ఈమ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేసిన పేసర్లు అవేశ్ ఖాన్, అక్షర్ దీప్ లు మరో మ్యాచ్ లో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్ పంత్ హాంకాంగ్ మ్యాచ్ లోనూ విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.