అసోంలోని గుహటిలో ఓ గజరాజు బైక్ తగిలించిన హెల్మెట్ మిగేసింది. జరిగింది. ఈ సంఘటనసత్‌గావ్ ఆర్మీ క్యాంపు సమీపంలో చోటుచేసుకుంది. ఆర్మీ క్యాంప్ ఆఫసు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు తగిలించిన హెల్మెట్ చూసింది. అనంతరం బైక్ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది. ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు.. ఆ హెల్మెట్‌ను నోట్లో వేసుకుంది. ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఏనుగు హెల్మెట్‌ను కిందపడేసి తొక్కేస్తుందని భావించారు.
కానీ ఏనుగు మాత్రం నోట్లోకి వేసుకొని మింగేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.