తెలంగాణ హైకోర్టులో భారీగా పెరిగిన జడ్జీల సంఖ్య!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్ట జడ్జిల సంఖ్యను ఒక్కసారిగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జడ్జిల సంఖ్య 42 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 మంది జడ్జీలు ఉండగా.. జడ్జీల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాగా 42 మంది జడ్జీల లో 32 మంది శాశ్వత జడ్జి పోస్టులు పది మంది అదనపు జడ్జి పోస్టులకు జస్టిస్ ఆమోదం లభించింది. హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే తలంపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీజేఐ కార్యాలయం వెల్లడించింది.
పెరిగిన జడ్జీల సంఖ్య  సంఖ్య తక్షణం అమల్లోకి..
తెలంగాణ హైకోర్టు సీజే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర న్యాయశాఖ తో పలుమార్లు సంప్రదించి కొత్త జడ్జి పోస్టుల ఆమోదానికి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చొరవ చూపారు. పెరిగిన జడ్జీల సంఖ్య తక్షణం అమల్లోకి రానుంది.