బీజేపీ పై విమర్శలు చేసిన వారికి నటి కుష్బూ తనిదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకొని వికసించదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించలేదంటూ విమర్శలు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఖాతా తెరవని పార్టీ, ఈసారి నాలుగు స్థానాలు గెలుచుకుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, రానున్న రోజుల్లో అధికారంలోకి కమలం పార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు.. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన అతని కుమారుడు నటుడు ఉదయనిధికి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు కనిమొళికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
Posted in
News
అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది: ఖుష్బూ
You May Also Like
Posted in
Featured
Education: చిన్నారిపై చదువు బండ..!
Posted by
admin
Posted in
Latest
Telangana: అభాండాలు…. అసత్యాలే ప్రతిపక్షాల నైజం..!
Posted by
admin