ఐపీఎల్ వాయిదా!

ఐపీఎల్ తాజా సీజన్లో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికార ప్రకటన చేసింది. ఆటగాళ్ళ భద్రత కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్( గాలి బుడగ) ఫెయిల్ కావడం టోర్నీ వాయిదాకు ముఖ్య కారణంగా తెల్సుతుంది. ఓ వైపు దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో టోర్నీ దుబాయ్ కి షిఫ్ట్ చేయలని వార్తలు వచ్చిన.. స్వదేశంలోనే టోర్నీ నిర్వహిస్తామని తెలిపిన బోర్డు.. పలు ఫ్రాంచేజి ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడడంతో గత్యంతరం లేక టోర్నీ వాయిదాకు మొగ్గుచూపింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా ఐపీఎల్ ను మొదట దుబాయ్ లో నిర్వహిస్తారని వార్తలొచ్చాయి. దీంతో వెంటనే స్పందించిన బోర్డు ఆవార్తలను కొట్టిపారేసి, బయోబబుల్( గాలి బుడగ) పద్ధతిలో, జాగ్రత్తలు తీసుకొని టోర్నీని స్వదేశంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు గాను ఆటగాళ్ళ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, అనుమతి రావడం వెంటవెంటనే జరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఫ్రాంచేజిల ఆటగాళ్ల తో పాటు సిబ్బందికి కరోనా రావడంతో అప్రమత్తమైన బోర్డు టోర్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

టోర్నీ వాయిదా తో వేల కోట్ల నష్టం..?ఐపీఎల్ సీజన్2021 నిరవధిక వాయిదా తో బోర్డు వేల కోట్లు భారం పడనుంది. ఇటువంటి పరిస్థితుల్లో బోర్డు ఏనిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా ఆటగాళ్ళ భద్రత మించి మాకు ఏదీ ముఖ్యం కాదని బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో పలువురు మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి..? టోర్నీ వాయిదా నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లను వారి స్వదేశాలకు తరలించడం బోర్డు ముందున్న అతిపెద్ద సవాల్. అంతేకాక కరోనా ఉధృతి దృష్ట్యా పలు దేశాలు, ఇండియాపై ఆంక్షలు విధించడంతో ఆటగాళ్ల తరలింపు బోర్డుకు తలకు మించిన భారంగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.