తెలంగాణలో లాక్‌డౌన్ వలన ఎలాంటి ఉపయెగం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక అవసరాలను బట్టి లాక్ డౌన్ పై తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచించిన వారంతపు లాక్ డౌన్ అంశంపై పరీశీలిస్తామన్నారు. ప్రజలు కరోనా గురించి భయపడాల్సిన అవసరంలేదని, పరిస్థితి అదుపులో ఉందని.. లాక్డౌన్ వలన ప్రజల జీవనోపాధి దెబ్బతింటుదని సీఎస్ వెల్లడించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ సరఫరా సాఫీగా కొనసాగుతోందని.. కిట్లు, పడకలు , ఆక్సిజన్ , నిత్యావసరాల వంటి వాటికి ఎలాంటి కొరత లేదని చెప్పుకొచ్చారు. ఎవరైనా కోవిడ్ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా త్వరితగా చికిత్స చేయించుకోవాలని సూచించారు.