atreya: ఎక్కడ Volga to Ganga ? ఎక్కడి ఆత్రేయ పాటలు..!

Nancharaiah merugumala senior journalist:

‘ కొళిపన్నయ్ చెల్లదురయ్ ‘ అనే తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇప్పుడు OTT లో చూస్తున్నా. దాంట్లో లైబ్రేరియన్ గా పనిచేసే ఒక మధ్య వయసు తండ్రి తన పాతికేళ్ల కొడుకుతో, ” నీకు బతుకంటే ఏంటో తెలియదు రా. సినీ పాటల రచయిత ఆచార్య ఆత్రేయ గారి పాటలన్నీ విను. అప్పుడు నీకు జీవితం ఏంటో అర్థమవుతుంది, ” అని అంటాడు. అదే సమయంలో…టీవీ సెట్ స్క్రీన్ మీద…” Please read Rahul Sankrityayan’s book- Volga To Ganga. Then you realize what life is! ” అనే అనువాద ఇంగ్లిష్ అక్షరాలు (Subtitles) కనిపించాయి.

అంటే మహా రచయిత, చరిత్రకారుడు, బౌద్ధ పండితుడు, అన్నిటికీ మించి నిఖార్సైన మార్క్సిస్టు రాహుల్ సాంకృత్యాయన్ (అసలు పేరు కేదార్ నాథ పాండే) ను… ఈ ఆరవ సినిమా సంంభాషణల అనువాద రచయిత ఎవరో తేలియదు గాని…ఆచార్య ఆత్రేయ స్థాయికి దించడం ఎందుకో నాకు నచ్చలేదు. ఈ ఇద్దరూ ( రాహుల్ జీ, ఆత్రేయ ) బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన బుద్దీజీవులే గాని…రాహుల్ జీని ‘ అనువాద సమస్య ‘ కారణంగా ఆత్రేయతో పోల్చడం, వోల్గా నుంచి గంగా అనే గొప్ప గ్రంథాన్ని ఆత్రేయ విరహ, నిరాశా ప్రేమ గీతాల ఎత్తుకు కుదించడం…నన్ను ఇన్ని అనవసర వాక్యాలు రాసేలా చేసింది.

Optimized by Optimole