జగిత్యాల: స్నేహితుల తీరుతో మానసికంగా క్షోభకు గురైన ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21) హైదరాబాద్ కూకట్‌పల్లి (KPHB)లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఇటీవల చదువులో వెనుకబడినదంటూ స్నేహితులు వైష్ణవి, సంజన ఆమెను అనుచితంగా అవమానించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన నిత్య ఈ నెల 2న స్వగ్రామానికి వెళ్లి గడ్డి మందు సేవించింది.
గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్నేహితులైన వైష్ణవి, సంజనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ వెల్లడించారు.