ganeshchaturthi: హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: బండి సంజయ్

Bandisanjay:  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ హారతి పట్టి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అక్కడున్న భక్తుల కోరిక మేరకు వినాయకుడితో బండి సంజయ్ సెల్ఫీ తీసుకున్నారు.

ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఐక్యతే లక్ష్యంగా, హిందూ జాగరణనే ధ్యేయంగా లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో… తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సకల సంపదలతో, సుఖ సంతోషాలతో అభివ్రుద్ధివైపు పయనించే శక్తిని ప్రసాదించాలని గణనాథుడిని వేడుకున్నారు.

Optimized by Optimole