Bandisanjay: పార్లమెంట్ లో తాను ఏనాడూ మాట్లాడలేదని, ఒక్క పైసా తీసుకురాలేదంటూ కేటీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ కు కళ్లు దొబ్బాయని, ఒక్క పార్లమెంట్ రికార్డులు చూసుకోవాలని సూచించారు. పార్లమెంట్ లో నిరంతరం వినోద్ కుమార్ మాట్లాడారని కండకావరమెక్కి మాట్లాడుతున్న కేటీఆర్… మరి వినోద్ కుమార్ సాధించేదేమిటో చెప్పాలన్నారు. కరీంనగర్- జగిత్యాల, కరీంనగర్–వరంగల్, ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్ల విస్తరణకు నిధులెందుకు తేలేదని ప్రశ్నించారు. ఆయా రోడ్ల విస్తరణకు రూ.వేల కోట్లు తీసుకొచ్చింది తానేననే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను సంపూర్తిగా అమలు చేసిన తరువాతే ఓట్లు అడగాలంటూ కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలో బాంబులు పెట్టి పేల్చి అల్లర్లు స్రుష్టించే పీఎఫ్ఐ నేతలకు పోటీపడి పైసలిచ్చిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలదని మండిపడ్డారు.
కేటీఆర్ కు కండకావరంతో కన్నుమిన్నూ కానకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను పార్లమెంట్ కు వెళ్లలేదట. ప్రశ్నలు అడగలేదట. పైసా తేలేదేట. కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నడు… ఒక్కసారి లోక్ సభ రికార్డులు తెచ్చుకుని చూడు.. ఎన్ని నిధులు తెచ్చానో లెక్కలన్నీ ఉన్నయ్.. చదువుకో… మీ అయ్య లెక్క పార్లమెంట్ కు పోకుండా తాగి పండుకోలే… చారిత్రాత్మక తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుంటే కూడా మీ అయ్య వెళ్లి ఓటేయకుండా తాగి పండుకున్నడు… సిగ్గు లేకుండా నా గురించి మాట్లాడుతున్నవా? నీకు దమ్ముంటే పార్లమెంట్ బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిసార్లు సభకు వెళ్లారో, నేను ఎన్నిసార్లు వెళ్లానో బయట పెట్టు’’అంటూ సవాల్ విసిరారు… ఈనెల 12న కరీంనగర్ లో బీఆర్ఎస్ కదన భేరీ నిర్వహించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ‘‘ప్రజలంతా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఊడ్చిపారేసినా సిగ్గు లేకుండా కదన భేరీ నిర్వహిస్తున్నరు. ఆ సభలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెబితే తప్ప మిమ్ముల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు’’అని అన్నారు.