ఐపీఎల్లో రాయల్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్లో రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆజట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ గాయంతో ఐపీఎల్‌ సీజన్ 2021 కి దూరం దూరమాయ్యడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన పోరులో క్రిస్‌ గేల్‌ క్యాచ్‌ను పట్టే క్రమంలో అతని వేలుకి గాయమైంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి వేలు విరిగినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన మేరకు అతనికి విశ్రాంతి అవసరమని తేలడంతో జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఊరటనిచ్చే అంశం ఏంటంటే అతను మైదానం బయట నుంచి ఆటగాళ్లకు సలహాలు ఇవ్వనున్నాడని రాయల్స్ యాజమాన్యం తెలిపింది.
పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట ఒక క్యాచ్‌ మిస్ చేసిన స్టోక్స్‌.. ఆ తర్వాత గేల్‌ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్‌ చేస్తూ పట్టాడు. డైవ్ చేసే క్రమంలో అతని వేలుకు గాయమైంది. ఆ తర్వాత ఫీల్డింగ్‌, బౌలింగ్‌ చేసిన కొంత అన్ ఈజీగా కనిపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా దిగి ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే ఔటయ్యాడు.

Optimized by Optimole