ఐపీఎల్లో ముంబై బోణి!

ఐపీఎల్ తాజా సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. మంగళవారం
కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాట్సమెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 36 బంతుల్లో 7×4, 2×6) , కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. కోల్ కత్త బౌలర్లలో రసెల్‌(15/5) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబయిని కట్టడి చేశాడు. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 142/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో ముంబయి ఇండియన్స్‌ 10 పరుగుల తేడాతో గెలిచింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ నితీశ్‌రాణా(57; 47 బంతుల్లో 6×4, 2×6) అర్ధశతకం సాధించగా, శుభ్‌మన్‌గిల్‌(33; 24 బంతుల్లో 5×4, 1×6) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ 4/27 నాలుగు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతనికే దక్కింది.

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో రాహుల్ చహార్..