ఉగాది పండగ వేళ టాలీవుడ్‌లో సినిమాల పోస్టర్లు సందడి చేశాయి. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని అలరించాయి. ప్రభాస్- పూజహేగ్దే జోడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’.. ఎన్టీఆర్ – రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’.. చిరంజీవి – రామ్‌చరణ్ కథానాయకులుగా కొరటాల శివ డైరక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’… వెంకటేష్ హీరోగా తమిళ్ అసురన్ రిమేక్ ‘నారప్ప’ .. రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న ‘విరాటపర్వం’, వరుణ్‌తేజ్ ‘గని’, సుశాంత్ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రాలకి సంబంధించిన కొత్త పోస్టర్లు మంగళవారం విడుదలయ్యాయి.
కాగా బోయపాటి దర్వకత్వంలో బాలక్రిష్ణ నటిస్తున్న చిత్ర టైటిల్ కూడిన ఓ చిన్న వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అఖండ’ పేరుతో విడుదలైన ఈ వీడియోలో కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదరగొడుతోంది. దీంతో బాలయ్య అభిమానుల్లో జోష్ నెలకొంది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.