ఉత్కంఠ పోరులో బెంగుళూరు విజయం!

ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వరుసగా రెండో విజయంను నమోదు చేసింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.తొలుత ‌టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన బెంగుళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 5×4, 6×3) అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ విరాట్  కోహ్లి( 33; 29  బంతుల్లో 4×4) ఫర్వాలేదనింపించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ 3, రషీద్‌ ఖాన్‌ 2, నదీమ్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు. ఛేదన

లో హైదరాబాద్‌..కెప్టెన్ డేవిడ్‌ వార్నర్ (57; 37 బంతుల్లో 7×4, 1×6) అర్ధ శతకంతో మెరవగా, మనిష్ పాండే (38; 39  బంతుల్లో 4×2, 6×2) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు నిలకడగా పరుగులు చేయడంతో హైదరాబాద్ గెలుపు ఖాయం అనుకున్నారు.వీరిద్దరూ ఔటైన తర్వాత సీన్ మారింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు పెవిలియన్ కి క్యూ కట్టడంతో సన్ రైజర్స్ ఓటమిని చవిచూసింది. హైదరాబాద్  చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన స్థితిలో ‌ 9 పరుగులే చేయడంతో బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌ 2 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. హర్షల్‌ పటేల్‌ 2, సిరాజ్‌ 2, జేమీసన్‌ 2, జేమీసన్‌ 1 వికెట్‌ పడగొట్టారు.