కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే సమయం ఆసన్నమైందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడు లేని విధంగా కేసీఆర్ కళ్లలో భయం కన్పిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేతలకు, కేసీఆర్తో రహస్య ఒప్పదం ఉందని.. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మేల్యేలు టీఆర్ ఎస్ చేరారని తెలిపారు. కేసీఆర్ దొంగ దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, ఎంతోమంది ప్రాణత్యాగాల వలన తెలంగాణ సాకారమైందని గుర్తుచేశారు. హలియా ముఖ్యమంత్రి సభపై స్పందిస్తూ.. కేసీఆర్ ప్రసంగం పాతచింతకాయ పచ్చడి మాదిరిగా ఉందన్నారు. పోడుభూముల సమస్యపై ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి ప్రజలు గుర్తొస్తారని అన్నారు. ముఖ్యమంత్రి పదవి చెప్పుతో సమానమన్న కేసీఆర్, ఇప్పడుమో ప్రజల బిక్ష అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని టీఆర్ ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.