దేశంలో రెండో బీజేపీ బ్రాహ్మణ సీఎంగా భజన్ లాల్ శర్మ..

Nancharaiah merugumala senior journalist:

” ఇప్పుడు దేశంలో రెండో బీజేపీ బ్రాహ్మణ సీఎంగా రాజస్తాన్ లో గద్దెనెక్కబోతున్న భజన్ లాల్ శర్మ “

ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు 12 అనుకుంటే వాటిలో రెండింటిలోనే బ్రాహ్మణ నేతలు ముఖ్గ్యమంత్రులుగా ఉన్నట్టు లెక్క.బీజేపీ రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా ఇప్పుడు భజన్ లాల్ శర్మ వస్తున్నారు. మంగళవారం రాజస్తాన్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎంపికైన ఈ భజన్ శర్మ హిందీ ‘Heartland’ రాష్ట్రాల్లో బీజేపీ తరపున సీఎం పీఠం ఎక్కుతున్న మొదటి బ్రామ్మణ నేత అనుకోవచ్చు. 1977లో మధ్యప్రదేశ్ సీఎంగా భోపాల్ లో ప్రమాణం చేసిన  కైలాష్ జోషీ పూర్వపు జనసంఘీయుడే గాని అప్పుడు ఆయన జనతా పార్టీ ముఖమంత్రి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రుల్లో అస్సామ్ సీఎం హిమంత బిశ్వా శర్మ ఒక్కరే బ్రామ్మణ కుటుంబంలో పుట్టారు. అయితే గతంలో పశ్చిమ రాష్జ్త్రాలైన గోవా (మనోహర్ పర్రీకర్), మహారాష్ట్ర (దేవేంద్ర ఫడణవీస్) బీజేపీ ముఖ్యమంత్రులుగా ఇద్దరు కాషాయ బ్రాహ్మణ నేతలు  అధికారంలో ఉన్న రోజులున్నాయి.