బాలీవుడ్ లో మరోజంట బ్రేకప్..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో విడిపోవడం అన్నది సాధారణం.”నచ్చితే కలిసుంటాం.. నచ్చకపోతే క్షణం కూడా కలిసుండం.. అంత మాత్రానా మామధ్య ఏ సంబంధం లేదని కాదు.. మేము మాత్రం జీవితాతం మంచి స్నేహితులుగా కలిసి ఉండాలనుకుంటున్నాం “ఈమాటలు తరుచుగా బాలీవుడ్ సెలబ్రెటీలు నోట వింటుటాం.
ఎందుకో ఈపాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎస్ మీరు గెస్ చేసింది నిజమే! బాలీవుడ్ లో మరో ప్రేమజంట విడిపోతుంది.టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేమపక్షులుగా సుపరిచితమైన షమితా శెట్టి- రాఖేష్ బాపట్ జంట విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

ఇక ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి సోదరిగా షమితా శెట్టి బాలీవుడ్ లోకి అరంగ్రేటం చేసింది. ఆమె పలు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈసమయంలోనే టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈషో సమయంలో సహచర నటుడు రాఖేష్ బాపట్ తో ఆమె ప్రేమలో పడింది. మనస్సులు కలవడంతో కొన్నాళ్లుగా ఇద్దరూ కలిసి సహజీవనం (డేటింగ్) చేశారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడివిడిగా ఉంటున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈక్రమంలోనే షమితా- రాఖేష్ జంట..తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇక షమితా శెట్టి పోస్టును పరిశీలిస్తే.”గత కొంతకాలంగా నేను రాఖేష్ విడివిడిగా ఉంటున్నాం..ఇద్దరి అంగీకారంతో విడిపోవాలని నిశ్చయించుకున్నాం..  ఈవిషయం మీకు తెలపడం ముఖ్యమని భావిస్తున్నాం.ఇంతకాలం మాకు అండగా ఉంటూ మద్దతు తెలిపిన అందరీకి కృతజ్ఞతలు” అంటూ ఆమె రాసుకొచ్చారు. అటు రాకేష్ సైతం తన ఖాతా ద్వారా విడిపోతున్నట్లు ప్రకటన చేశాడు. “నేను షమితా ఇకపై కలిసి ఉండలేమని నిర్ధారించుకున్నాం. విధి అసాధారణ పరిస్థితుల్లో మమ్మల్ని కలిపింది. మాకు మద్దతుగా నిలిచిన షరా కుటుంబంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు. మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా” అంటూ పోస్టుకు మ్యూజిక్ యాడ్ చేసిన వీడియోనూ పోస్టు చేశాడు.