బెంగాల్లో 200 పైగా స్థానాలు గెలుస్తాం : రాజ్నాథ్ సింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు గెలుస్తుందని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం బెంగాల్ ఎన్నికలు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధించిడం ఖాయమని అన్నారు. బెంగాల్లో  ప్రజాస్వామ్యం ఖునీ అయ్యిందన్నారు. ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తృణమూల్  ప్రభుత్వానికి హితబోధ చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఆయన జోయ్‌పూర్, తల్డాంగ్రా, కాక్‌ద్వీప్ అసెంబ్లీ స్థానాల్లో పర్యటించారు. బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.