తిరుపతి బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ రత్నప్రభ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో రత్నపభ కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచే శారు. పదవీవిమరణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రధానంగా కొందరి పేర్లు వినిపించిన తుదకు ఆమెను ఎంపిక చేశారు. తిరుపతిలో విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో, దానిని దృష్టిలో పెట్టుకొని, అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనాతో మృతి చెందడంతో, ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార వైసీపీ తమ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ఖరారు చేయగా.. ప్రతిపక్ష టీడీపీ తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ప్రకటించింది. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు.. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి సెగ్మెంట్లు ఉన్నాయి.