బాలీవుడ్ ని వెంటాడుతున్న బాయ్ కాట్ సెగ విజయదేవరకొండ ‘ లైగర్’ సినిమాను తాకింది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ నూ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ బడా ప్రోడ్యూసర్ కరణ్ జోహర్ లైగర్ మూవీకి నిర్మాతల్లో ఒకరు కావడవంతో.. నెటిజన్స్ లైగర్ మూవీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ కరణ్ అని.. లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తూ పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక మరో ఐదు రోజుల్లో లైగర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల నేపథ్యంలో బాయ్ కాట్ వ్యవహరంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ సినిమాలు బాయ్ కాట్ సెగకు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను చవిచూశాయి. అటు షారూక్ మూవీ పఠాన్, రణ్ బీర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీలను కూడా బాయ్ కాట్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే బాయ్ కాట్ పఠాన్, బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.