పవర్ స్టార్ మూవీలో బ్రహ్మానందం!

టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ అనగానే గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. తనదైన కామెడీ టైమింగ్తో తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. వెయ్యి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. ఇటివల సినిమాల కు కొంత గ్యాప్ ఇచ్చిన బ్రహ్మీ.. తాజాగా భీమ్లానాయక్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఆయన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేదీ చిత్రాల్లో పవన్ _ బ్రహ్మీ కామెడీ ట్రాక్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాలో వీరి కామెడీ ఓ రేంజ్లో ఉంటుందని అభిమానులూ భావిస్తున్నారు.
కాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లానాయక్‌ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నారు.తమన్‌ స్వరాలు సమకూర్చారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ ప్రైజెస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.