తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఊటి దగ్గర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలకాప్టర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఇందులో మొత్తం 14 మంది ఆర్మీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు హెలికాప్టర్ ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు తెలిపింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా తెలిపింది.