పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టి పరిధిలోకి తీసుకొస్తే, వాటిపై పన్నులు మరింత తగ్గుతాయన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఇంధన ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులని నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే, వీటిపై పన్నులు తగ్గుతాయని, కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని గడ్కరీ పేర్కోన్నారు.