ఫైనల్లో ఆస్ట్రేలియా.. కంగుతిన్న పాక్..!!

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆసీస్ 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ వేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో డేవిడ్ వార్నర్ (49), మార్కస్ స్టాయినిస్‌ (40) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్‌ (41) ధనాదన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
పాక్ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు, షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన పాక్ జట్టుకు ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (67), బాబర్‌ అజామ్‌(39) శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో పాక్‌ 9 ఓవర్లకు 68/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రమాదకరం గా మారుతున్న ఈ జోడిని జంపా విడదీశాడు.ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో చివరి బంతికి బాబర్‌ అజామ్‌.. జంపా బౌలింగ్ లో వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రిజులోకి వచ్చిన ఫకార్‌ జమాన్‌(55)తో రిజ్వాన్ తో కలిసి ఇన్నింగ్స్ జోరు పెంచాడు. ఈ క్రమంలోనే రిజ్వన్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అతను ఔటైన ఫకర్ ఫటాఫట్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో పాక్ 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది.ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్‌, జంపా తలో వికెట్ తీశారు.