తాండూరులో బీఆర్ఎస్ నయా ప్లాన్.. కాంగ్రెస్ లోకి మంత్రి అనుచరుడు.

Vikarabad: మంత్రి మహేందర్ రెడ్డి  అనుచరుడితో కలిసి  బిగ్ స్కెచ్ వేశారు. ఆయన ప్రధాన అనుచరుడు డిసిసిబి చైర్మన్  మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. ఈ విషయం  బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..మంత్రి మహేందర్ రెడ్డిని మందలించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి.. అనుచరుడిని పార్టీ మారకుండా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మనోహర్ వైఖరిలో మార్పు రాలేదు. 

మరోవైపు అనుచరుడి పార్టీ మార్పును కట్టడి చేయలేని మంత్రి మహేదంర్ రెడ్డి బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల ముందు వరకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి..మహేందర్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. కేటీఆర్ చొరవతో ఇద్దరు కలిసిపోయారు.అయినప్పటికీ  వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఇద్దరు అంటిముట్టినట్లు ఉంటున్నారు. దీంతో అనుచరుడు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటి చేయించి రోహిత్ రెడ్డిని దెబ్బ కొట్టాలని మంత్రి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. అనంతరం  మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వారం రోజులకే బీఆర్ఎస్ లోకి తీసుకెళ్ళి బీఆర్ఎస్ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలని మంత్రి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ తో సైతం మహేందర్ రెడ్డి చర్చించినట్లు తాండూరు కాంగ్రెస్ నేతల్లో  తీవ్ర చర్చ జరుగుతోంది.