జగన్… ఓ రూపాయి పావలా ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్

APpolitics: ‘జగన్ ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా  మాయ’’ గుర్తుకొస్తుందని ఎద్దేవ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల్లూరులో తన చిన్నపుడు ఓ పెద్ద బుట్టలో బొమ్మలు పెట్టుకొని రూపాయి పావలా… రూపాయి పావలా అని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారని.. చిన్నప్పుడు వాటి కోసం మా అమ్మ దగ్గర మారాం చేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. వారాహి విజయ యాత్ర_ 4 లో భాగంగా పెడన లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ.. చిన్నపుడు పెద్ద బొమ్మలు రూపాయి పావలా అంటే ఆశ కలిగేదని.. ఎలాగైనా కొనాలని గోల చేస్తే అమ్మ మందలించేదని పవన్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఎలాగోలా రూపాయి పావలా సంపాదించి, ఆ బొమ్మలు అమ్మే వారి దగ్గరకు వెళ్లి బొమ్మ ఇవ్వండి అంటే ఆ బొమ్మల వ్యాపారులు ఒక్కో బొమ్మకు ఒక్కో రేటు చెప్పేవారని.. వారు వీధుల్లో గట్టిగా అరిచిన రూపాయి పావలా రేటుకు అసలు బొమ్మలే లేవని.. అందరిలో ఆశ పుట్టించి, తర్వాత ఎలాగైనా ఆ బొమ్మలు కొనుగోలు చేయించాలనేది ఆ రూపాయి పావలా వ్యాపారుల స్ట్రాటజీగా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అచ్చంగా అలాగే జరుగుతోందని.. జగన్ అనే రూపాయి పావలా ముఖ్యమంత్రి తన రూపాయి పావలా ప్రభుత్వంలో నవరత్నాలు అనే మోసాన్ని బహిరంగంగా చేస్తూ, ప్రజల్ని ఏమారుస్తున్నాడని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో చెప్పిన నవరత్నాలన్నీ రూపాయి పావలా స్ట్రాటజీ పథకాలే అని జనం కూడా అర్ధం చేసుకున్నారని పవన్ స్పష్టం చేశారు .

కాగా ‘‘2014లో శ్రీ నరేంద్ర మోదీ..  చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని సంపూర్ణంగా నమ్మి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే బలమైన కాంక్షతోనే మద్దతు ఇచ్చానని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు. విభజన గాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు బలమైన మంచి భవిష్యత్తు కావాలంటే  మోదీ- బాబు గారి ఆలోచనలు అవసరమని భావించినట్లు చెప్పుకొచ్చారు. దశాబ్దకాలంలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన గాయం నుంచి కోలుకొని అత్యున్నతంగా ముందుకు వెళుతుందని అనుకున్నట్లు.. అయితే అది జరగలేదని.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న సమయంలో, ప్రజలంతా అభద్రతలో బతుకుతున్న రోజుల్లో కచ్చితంగా రాష్ట్రాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదనే బలంగా నిర్ణయించుకున్నట్లు  తేల్చిచెప్పారు.2021లో ఇచ్చిన పిలుపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ పొత్తుతో కలిసి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లబోతున్నట్లు పవన్ కుండ బద్దలు కొట్టారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole