మలయాళ సూపర్ హిట్ ‘కప్పేలా’ రీమేక్ గా రూపొందిన చిత్రం బుట్టబొమ్మ.అనికా సురేంద్రన్ ,అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలో నటించారు. శౌరి చంద్రశేఖర్ దర్శకుడు. నాగవంశీ,సాయి సౌజన్య నిర్మాతలు. శనివారం ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం!
కథ ..
అరకు ప్రకృతి అందాల మధ్య పెరిగిన మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి సత్య (అనికా సురేంద్రన్). తల్లి టైలరింగ్, తండ్రి రైస్ మిల్లులో పనిచేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ కొనుక్కోని రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలన్నది సత్య కల. కానీ అనుకోకుండా ఓ రాంగ్ కాల్ ద్వారా మురళి (సూర్య వశిష్ట) పరిచయమవుతాడు. పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈక్రమంలోనే సత్య తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన చిన్నితో పెళ్లి కుదుర్చుతారు. పెళ్లి ఇష్టంలేకపోవడంతో చెప్పాపెట్టకుండా మురళి కోసం విశాఖపట్నం వెళుతుంది సత్య. ఈ ప్రయాణంలో ఆమె అనేక ఒడిదోడుకులు ఎదుర్కొవలసి వస్తుంది. ఇంతకు మురళి, సత్య కలుస్తారా? రామకృష్ణ(అర్జున్ దాస్) ఎందుకు సత్యను వెంబడిస్తారు? అతని పాత్ర ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే..?
సమాజంలో ఆడపిల్లలపై జరిగే అకృత్యాల ఆధారంగా బుట్టబొమ్మ కథ తెరకెక్కింది. ఫస్ట్ ఆఫ్ లవ్ ట్రాక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి కథనంలో వేగం లోపించింది. ముఖాలు చూసుకోకుండా ప్రేమించడం పాయింట్ తో చాలా సినిమాలు వచ్చాయి. రోటిన్ కథ అయినప్పటికి.. పాత్రలను ఎలివేట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. సత్య- మురళి లవ్ ట్రాక్ ఓకే అనిపిస్తుంది . రామకృష్ణ ఎంట్రీతో సినిమా మరో లెవల్‌కి వెళ్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఆలోచింపజేసేలా ఉన్నా.. ముగింపు బాగోలేదు.
ఎవరెలా చేశారంటే..?
ఫస్ట్ సినిమా అయినా నటన పరంగా సూర్య వశిష్ఠ ఆకట్టుకున్నాడు. లవ్ ట్రాక్ సీన్స్ లో జీవించేశాడు. అనికా సురేంద్రన్ అందం, అభినయంతో మెప్పించింది. కీలక పాత్రలో నటించిన అర్జున్ దాస్ యాక్టింగ్ సినిమాకు హైలెట్. గణేష్ రావూరి డైలాగ్స్ ఉన్నంతలో ఓకే. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతికత విభాగం పనితీరు చూస్కుంటే.. మ్యూజిక్ సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
“పేరుకు తగ్గట్టు రూపులేని బుట్టబొమ్మ”
రేటింగ్ : 2.5/5 (సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)