నవ్వులు పూయిస్తున్న యువతి కేక్ ఆర్డర్ వీడియో !

కేక్ ఆర్డర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో నవ్వులుపూయిస్తోంది. ఓ మహిళ ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ బాయ్ ఆమె ఒకటి చెబితే మరోటి చేశాడు. ఈవిషయాన్ని సదరు యువతి నవ్వుతూ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించింది. ఇంతకు డెలివరీ బాయ్ చేసిన పనేంటో తెలిస్తే మీరు నవ్వుఆపుకోలేరు!

ఢిల్లీకి చెందిన వైష్ణవి మోంద్కర్ జొమాటోలో కేక్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ కింది డెలివరీ బాయ్ కి కొన్ని సూచనలు చేసింది. కేక్ తీసుకొచ్చేటప్పుడు రూ.500 చిల్లర తీసుకురండి అంటూ మెసెజ్ చేసింది . ఆ తర్వాత డెలివరీ బాయ్.. కేక్ డెలవరీ చేశాడు. దీంతో యువతి బాక్స్ ఓపెన్ చేసి చూడగా షాక్ తింది.కేక్ పై bring 500/ change రాసి ఉండటాన్ని చూసి చిర్రెత్తుకొచ్చి డెలివరీ బాయ్ ను ప్రశ్నించింది. ఇందుకు సమాధానంగా అతను.. మీరే కదా బ్రింగ్ 500/ చేంజ్ అన్నారు. అందుకే అలా రాశారని చెప్పుకొచ్చాడు. దీంతో చేసేదేమిలేక కేక్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డెలివరీ సూచనల్లో నేను “500/- ఛేంజ్ తీసుకురండి అని రాశాను”( అన్‌హోనే కేక్ పె లిఖ్కే భేజా) అంటూ వైష్ణవి ఫేస్‌బుక్‌లో నవ్వుతూ చెప్పుకొచ్చింది.