ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల పోరు …

ఎన్నికలకు ఏడాది ముందరే  పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్‌ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును…

Read More

చంద్రబాబు దారే రాహులుకు రహదారి అవుతుందా?

Nancharaiah merugumala: ====================== ఎట్టకేలకు తెలుగుదేశం నేత నారా చంద్ర బాబు నాయుడు బాటలోకి వచ్చాడు కాంగ్రెస్ ఉగ్రనేత రాహుల్ గాంధీ. బాబులా తెల్ల గడ్డం పెంచాడు. నారావారిపల్లె నవ యువకుడి రీతిలో  ఇతర మేధావుల సలహాలు యువ ‘ప్రిన్స్’ వింటున్నాడు. చంద్రన్న 1990ల మధ్యలో అధికారంలోకి వచ్చాక ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ అనే బంగారు నినాదంతో దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ‘జనరంజకంగా’ పరిపాలించారు. ఇప్పుడు అధికారం కోసం దక్షిణం నుంచి ఉత్తరాదికి నడిచిన రాహుల్ చంద్రబాబు తరహాలో…

Read More

‘పవన్ ‘అభిమన్యుడు కాదు అర్జునుడు: ఎంపీ రఘురామ

సమాజ హితం కోసం బాబు, పవన్ కలువాల్సిందేనన్నారు ఎంపీ  రఘురామ కృష్ణంరాజు.ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించడమే  తక్షణ కర్తవ్యమన్నారు. వ్యక్తిగత మేలు కోసం కాకుండా.. ప్రజల కోసం ఏకం కావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.పసుపు, ఎరుపు రంగు కలిస్తే కాషాయమేనని తేల్చిచెప్పారు.  గతంలో జగన్ ను తిట్టిన వారే ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని రఘురామ గుర్తు చేశారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడం…

Read More

విలువలెరిగిన తండ్రి..

చదువు ఎంత ముఖ్యమో తెలిసిన ఒక తండ్రి. ఆ చదువు కూడా ఏ ఉన్నత ప్రమాణాలతో ఉండాలో తెలిసి, అందుకు సిద్దపడ్డ సాహసి! రాజస్థాన్ రాజధాని జైపూర్ లో, రాజకుటుంబీకులు, ఇతర సంపన్నుల పిల్లలు చదువుకునే (సెయింట్ గ్జేవియర్ అనుకుంటా, పేరు సరిగా గుర్తులేదు) కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు తన కొడుకుని. జోద్పూర్ ప్రాంతంలో రెవెన్యూలో ఓ సాధారణ ఉద్యోగిగా తనకొచ్చే 60 రూపాయల నెల జీతంలో, 50 రూపాయల నెలసరి ఫీజు కట్టి కాన్వెంట్ స్కూల్లో…

Read More

వైసీపీ పతనాన్ని కళ్లారా చూస్తాం: నాగబాబు

యువత రాజకీయాల్లోకి రాకపోతే.. అవినీతి పరులు రాజ్యమేలతారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆరోపించారు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని..అతి త్వరలోనే ఆ పార్టీ పతనాన్ని మనందరం కళ్లారా చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రణస్థలం వివేకానంద వికాస సభలో ఆయన మాట్లాడుతూ.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత ఇటీవల…

Read More

యువత బలమైన పోరాటాలు చేస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది: మనోహర్

యువత పోరాటంతోనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.శ్రీకాకుళం రణస్థలం యువశక్తి సభలో భాగంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.తెలంగాణతో పోలిస్తే నిరుద్యోగ రేటు ఏపీలో డబుల్ ఉందన్నారు. కావాలనే ఉత్తరాంధ్రా ప్రాంతంలో యువ నాయకత్వాన్ని తొక్కేశారని మండిపడ్డారు. వైసీపీ జెండాలు మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వైసీపీ నాయకులు కొండల్ని మింగేస్తూ… కోట్లు కొల్లగొడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో జనసేన…

Read More

జనసేన యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం..

జనసేన యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం చేశామన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ . సభా వేదిక నుంచి జనసేన భవిష్యత్తు కార్యాచరణను  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారని తెలిపారు.  రణస్థలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించబోయే యువశక్తి సభ వేదిక వద్ద.. వైసీపీ ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎంత మభ్యపెడుతుందో చెప్పడానికి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజలను పూర్తిగా అయోమయంలోకి నెట్టి…

Read More

ఉత్తరాంధ్ర సమస్యలపై సీఎం జగన్‌ కి మాజీ ఎంపీ కొణతాల లేఖ ..

ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ.. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.‘‘నీళ్లు`నిధులు`నియామకాలు’ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలు..వివక్షత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఉత్తరాంధ్ర నుండి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది వలసలు పోతున్నారని.. ఒక్క హైదరాబాదులోనే 15 లక్షల మంది ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు వాచ్‌మెన్‌లుగా, చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నట్లు మీడియాలో అనేక కథనాలు వచ్చిన…

Read More

తెలంగాణ CS రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్షాలు..

సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయించడాన్ని రద్దుచేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. రాష్ట్ర విభజన తర్వాత DOPT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కేడర్  అధికారులను పక్కనపెట్టి…. ఏపీకి కేటాయించిన అధికారిని సీఎస్  పదవిలో నియమించడం ద్వారా సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని సంజయ్  విమర్శించారు. అటు…

Read More

వైసీపీ నాయకుల చవకబారు మాటలు మానుకోవాలి: నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రానికి తీవ్ర నష్టమన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టిడిపి అధినేత చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ మంత్రులు ఉలిక్కిపడడం చూసి జాలేస్తుందని ఎద్దేవ చేశారు. పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ కుటుంబ సభ్యులను.. అలాగే  గ్రంధి సన్యాసి రాజుని… రాజాంలోని వారి నివాసంలో  మనోహర్ ఆత్మీయంగా కలిశారు. అనంతరం ఆయన మీడియతో  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు….

Read More
Optimized by Optimole