పేరుతో కాదు..‘ఫేమ్’తోనే పని !
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిరదంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షసకృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా…….