Latest
literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!
Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట తెలియర విశ్వదాభిరామ వినుర వేమ! అంటాడు యోగి వేమన. అభిమానించే దైవం మదిలోనే ఉంటాడని, ఉండాలని ఓ లెక్క! నమ్మకమే ఉంటే…. దేవుడెక్కడ లేడు చెప్పండి? ఇదీ హేతువు! ఇదంతా విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం. మనది ప్రధానంగా విశ్వాసాల మీద ఆధారపడిన జీవన వ్యవస్థ. మనిషిలోని ఈ బలహీనతను సొమ్ము చేసుకునే వ్యాపార ప్రక్రియలు ఇతర అన్ని వ్యవస్థల్లోకి…
BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?
BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల కిందటే (1967) ఒక చరిత్రాత్మక సందేశాన్నిచ్చింది. ‘పార్టీలో కొత్తవారి చేరిక, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం వంటివి జరిగినపుడు…. పార్టీలో కొత్తగా చేరే వారు, పాత నాయకుల మధ్య ఓ సంఘర్షణ, సమస్యలు తలెత్తడం ఉంటుంది. దాన్ని సంయమనంతో అధిగమించాలి’ అని నిర్ణయించింది. అదే సందర్భంలో పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ‘అస్పృశ్యత నేరం, రాజకీయ అస్పృశ్యత అతిపెద్ద…
vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!
Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏకాదశి గురించి మరి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. భవిశ్యోత్తర పురాణం: వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే…
literature: మన తెలుగు – మన వెలుగు.. పద్య నిర్మాణ కౌశలం..!
Teluguliterature: శా : ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం చిద్ర్దోహంబును నీకుఁజేయరు, బలోత్సేకంబుతోఁ జీకటిన్ భద్రాకారులఁ చిన్న పాపల రణప్రౌఢక్రియా హీనులన్ నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో? ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డలు… అదీ అన్నెం-పుణ్ణెమెరుగని చిన్నారులు… ఒకరో ఇద్దరో కాదు ఐదుగురిని, ఒక్కపెట్టున గొంతుకోసి సంహరిస్తే ఏ తల్తి గర్భశోకమైనా ఎలా ఉంటుంది? గుండెను పిడికిట పట్టి పిసికినట్టుండే ఆ తల్లి హృదయ వేదనను ఆవాహన చేసుకొని… బమ్మెర పోతన రాసిన…
Shabana: ఆ అభినయ అందం పేరు ‘షబానా’..
విశి: ప్రియతమా లే, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే యుద్ధ జ్వాలలు మన లోకాన్ని ముంచెత్తుతున్నాయి కాలమూ విధీ ఒకే ఆకాంక్షను ప్రకటిస్తున్నాయి మన కన్నీళ్లివాళ వేడి వేడి లావాలా ప్రవహిస్తాయి అందానికీ ప్రేమకూ ఇవాళ ఒకటే జీవితం, ఒకటే ఆత్మ నువ్విక నాతో కలిసి స్వేచ్ఛాజ్వాలతో కరిగిపోవలసిందే లే, నా ప్రియతమా, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే (మూలం: కైఫీ ఆజ్మీ – అనువాదం: ఎన్ వేణుగోపాల్) షబానా ఆజ్మీ తండ్రి కైఫీ ఆజ్మీ కవి….
Hindudharma: అనంత శ్రీరామ్ ప్రసంగం విన్నాక హిందూ ధర్మాన్ని కాపాడతారేమోననిపిస్తోంది!
Nancharaiah merugumala senior journalist: పాటల రచయిత అనంత శ్రీరామ్ ‘హైందవ శంఖారావం’ ప్రసంగం విన్నాక పశ్చిమ గోదావరి సినీ కాపులే సనాతన హిందూ ధర్మాన్ని కాపాడతారేమోననిపిస్తోంది! తెలుగు సినిమాల్లో హిందూ ధర్మం మీద దాడి జరుగుతోందని ‘హైందవ శంఖారావం’ సభలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించడం లేదు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్ (వీఎచ్‌పీ) ఈ సభ నిర్వహించింది. అన్ని రాజకీయ పక్షాల్లో పనిచేసిన…
BJPtelangana: కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్: బోయినపల్లి ప్రవీణ్
Karimnagar: రైతులకు పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15,000 ఇస్తామని ఆశలు పెట్టి ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేడు రూ .12 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని, కాంగ్రెస్ అంటేనే మోసానికి, నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. సోమవారం కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల…
INCTelangana: ఎవుసానికి కాంగ్రెస్ భరోసా..!
Telangana: -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు. ============== నూతన సంవత్సరం తొలివారంలోనే శుభవార్త విన్న తెలంగాణ రైతన్నలకు పది రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎల్లప్పుడూ ముందుండే కాంగ్రెస్ అన్నదాతలకు మరింత భరోసా కల్పిస్తూ ‘రైతు భరోసా’ను ప్రకటించి మాది ‘రైతు ప్రభుత్వం’ అని మరోసారి నిరూపించుకుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ‘రైతు రుణమాఫీ’ ‘వరికి బోనస్’ పథకాలను అమలుచేసిన కాంగ్రెస్ ఇప్పుడు…
