ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : పవన్ కళ్యాణ్
ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్త్రీమూర్తి సేవలు వెలకట్టలేనివని..మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని.. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్రకటన విడుదల చేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయని ధృడంగా విశ్వసిస్తానని తెలిపారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి…