క్రేజీవాల్ కు ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య వార్నింగ్..

పార్థ సారథి పొట్లూరి:నా భర్తని జైలులో నుండి బయటికి తెప్పించకపోతే నీ బండారం అమిత్ షా ముందు బయటపెడతాను  కేజ్రీవాల్ ని బెదిరించింన ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య..!!

30 వ తేదీ మే నెల 2022 న ED మనీలాండరింగ్ కేసులో ఆప్ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ని అరెస్ట్ చేసింది !ఇప్పటికి 10 నెలల నుండి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లోనే ఉన్నాడు కానీ బెయిల్ రాలేదు!ఈ నేపధ్యంలో సత్యేనదర్ జైన్ భార్య ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని కలిసి ఇంకెన్నాళ్ళు నా భర్త జైల్లో ఉంటాడని నిలదీసినట్లు తెలిసింది. దానికి బదులుగా బెయిల్ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉన్నదీ   ప్రతిసారీ ED అధికారులు ఒప్పుకోవడం లేదని ..వీలున్నంత త్వరగా బెయిల్ రావడానికి కృషి చేస్తున్నాను అంటూ క్రేజీవాల్ బదులిచ్చాడని తెలుస్తోంది.

కాగా క్రేజీవాల్ సమాధానంతో సంతృప్తి చెందని సత్యేంద్ర జైన్ భార్య నా భర్తని జైల్లో పెట్టించి మీరు అధికారాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.  వారం లోగా నా భర్త ని కనుక జైల్లో నుండి బయటికి రప్పించకపోతే మీ బండారం మొత్తం అమిత్ షా కి  వివరంగా చెప్తానని హెచ్చరించినట్లు తెలిసింది.

ఇక  సత్యేంద్ర జైన్ భార్య దగ్గర మనీ లాండరింగ్ తాలూకు సమాచారం ఉండి ఉంటుంది లేదా తీహార్ జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్ తన భార్యతో వివరంగా చెప్పి ఉండవచ్చా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఒక వేళ కేజ్రీవాల్ కనుక సత్యేంద్ర జైన్ కి బెయిల్ కొసమ్ ప్రయత్నిస్తున్నట్లు నటిస్తున్నాడు అని అనిపించిన  మరు క్షణం అసలు నిజాలు బయటికి వచ్చేస్తాయని ఆప్ నేతలు చర్చించుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అవకాశాన్ని జారవిడుచుకోవద్దని బిజేపి పట్టుదలగా కనిపిస్తోంది.

కేజ్రీవాల్ డ్రామా !

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ED అరెస్ట్ చేసిన వారం రోజులకే సిసోడియా అధికార గృహాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఎస్టేట్ అధికారులు కుటుంబ సభ్యులకి  నోటీసులు ఇచ్చారు. ఇది కేజ్రీవాల్ అనుమతి లేకుండా జరగదని వారి భావన. మనీష్ శిశోడియా బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే కానీ అతనికి  బెయిల్ రాదని ముందే  ఊహించిన కేజ్రీ వాల్ సిసోడియ కుటుంబ సభ్యులని అధికార నివాసం ని ఖాళీ చేయమని ఆదేశాలు ఇచ్చాడని టాక్.

గమ్మత్తు ఏమిటంటే సత్యేంద్ర జైన్ గత 10 నెలల నుండి జైల్లోనే ఉన్నా ఇప్పటివరకు అధికార నివాసాన్ని ఖాళీ చేయమని అడగలేదు ఎందుకు ? అంటే దీనర్ధం మనీష్ సిసోడియ కంటే సత్యేంద్ర జైన్ దగ్గరే ఎక్కువ సమాచారం ఉండి ఉంటుందని తెలుస్తోంది. అవినీతి గురించి.. దైర్యంగా  సత్యేంద్ర జైన్ భార్య నేరుగా కేజ్రీ వాల్ ని కలిసి అమిత్ షా కి నిజాలు చెప్పేస్తాను అని బెదిరించేదాకా వెళ్ళింది అంటే సిసోడియ కంటే సత్యేంద్ర జైన్ దగ్గరే ఎక్కువ సమాచారం ఉన్నట్లే కదా ? అన్న చర్చ జరుగుతుంది.

గత పది నెలలుగా సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నా, మనీష్ సిసోడియ అరెస్ట్ అయిన నాలుగు రోజులకే ఇద్దరినీ రాజీనామా చేయమని ఎందుకు అడిగినట్లు? ఉప ముఖ్యమంత్రి హోదాలో జైల్లో సౌకర్యాలు లేకుండా చేయడానికేనా ?నేను చాలా తెలివిగల వాడిని అనే అహంకారంలో ఉన్న కేజ్రీవాల్ తన గొయ్యిని తానే తవ్వుకున్నాడని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే కేజ్రీవాల్ ఎవ్వరినీ నమ్మడు. ఆప్ మాజీ ముఖ్యుడు ప్రశాంత్ భూషణ్ ని అవమానకరంగా బయటికి వేళ్ళ గొట్టాడు.. ఇప్పుడు తన కేసులని ప్రశాంత్ భూషణ్ ని వాదించమని అడగలేడు కదా అన్న చర్చ ఆప్ నేతల్లో నడుస్తోంది.

మనీష్ సిసోడియ ని దగ్గర నుండి చూసినవాళ్ళు ఎవరూ కూడా ఆప్ పార్టీలో  కేజ్రీవాల్ ని నమ్మే పరిస్థితి లేదు.  ఆ మాటకొస్తే కేజ్రీ వాల్ కి బాగా దగ్గరయ్యారు అని అనుకున్నవాళ్ళు అందరూ జైలుకి వెళ్లడమో లేదా పార్టీ నుండి వెళ్లిపోవడమో జరిగింది ఇప్పటివరకు !చాలా కొద్ది రోజుల్లోనే కేజ్రీవాల్ గురుంచి మంచి శుభవార్త వినబోతున్నామన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

జైహింద్ ! జై భారత్ !