నల్లగొండ: జిల్లాకు చెందిన రామకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. నేరేడుగొమ్ము మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ హైదరాబాద్‌లోని బండ్లగూడ అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీలో 2021 వ సంవత్సరంలో లా డిగ్రీ పూర్తిచేశాడు. బ్యాచ్ లో టాపర్ గా నిలిచాడు. ప్రస్తుతం అతను అడ్వకేట్ ప్రాక్టీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అరోరా కళాశాల యాజమాన్యం శనివారం ఇండక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా జస్టిస్ భీమపాక నగేష్ హాజరయ్యారు. జస్టిస్ చేతుల మీదుగా లా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన రామ కృష్ణ కు గోల్డ్ మెడల్ ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్దులు, కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.