కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌లకు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల తొలిజాబితాను విడుద‌ల చేసింది. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ.. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటిచేయ‌నున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరను , కొరటగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పార్టీ బరిలోకి దింపింది. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప (చితాపూర్) , కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే వరుసగా దేవనహళ్లి, (ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు.


కాగా మార్చి 17న ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అధ్యక్షతన‌ స‌మావేశ‌మైన‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల తొలి జాబితాను ఫైన‌ల్ చేసింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. కర్ణాటక ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీ కాంగ్రెస్ కావ‌డం గ‌మ‌న్హారం. మే నెల‌లో క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు.

Optimized by Optimole