ముఖ్యమంత్రి అయి ఉండి.. ధర్నాలు చేయడమేంటి ?
అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ పరిస్థితికి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటారా.. తమకు ఎదరులేదు బెదురులేదు అనుకున్న టీర్ ఎస్ పార్టీకి దుబ్బాక, జీహెచ్ ఎంసీ , హుజురాబాద్ ఉప ఎన్నికలు షాకిచ్చాయి. వీటికి తోడు వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెట్రోల్, డీజీల్ ధరలపై కేంద్రంపై సుంకాన్ని తగ్గించి.. ఇరకాటంలో పెట్టండంతో టీఆర్ ఎస్ పార్టీలో కలవరం మొదలైంది….