గౌతమ్ ఆదానీ భారత్ లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపు దారుల లిస్ట్ లో ఎందుకు లేడు ?

పార్థసారథి పొట్లూరి: 

====================

గౌతమ్ ఆదానీ భారత్ లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపు దారుల లిస్ట్ లో ఎందుకు లేడు..?
ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి !
అసలు నిజం తెలుసుకోండి !
గౌతమ్ ఆదానీ వారం క్రితం వరకు ప్రపంచంలోనే అత్యంత ధవంతుల జాబితాలో 3 వ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు 8 వ స్థానానికి పడిపోయాడు !
మరి అత్యధిక పన్ను చెల్లింపు దారుల స్థానాలలో మొదటి స్థానంలో ఉండాలి కదా ?
విషయం ఏమిటంటే భారత ప్రభుత్వం పన్ను విధించేది కార్పొరేట్ ప్రొఫైల్ మీద.
అంతే కానీ మార్కెట్ కాపిటల్ మీద కాదు!
**********************
మార్కెట్ కాపిటల్ వేరు,కార్పొరేట్ ప్రొఫైల్ వేరు.
గౌతమ్ ఆదానీ మార్కెట్ కాపిటల్ వల్ల అత్యంత ధవంతుడు. అంతే కానీ ఆదానీ కార్పొరేట్ ప్రొఫైల్ వల్ల కాదు.
SBI ,రిలయన్స్ సంస్థలు ఎక్కువ పన్ను చెల్లించే జాబితాలో ఉన్నాయి కానీ ఆదానీ కాదు!
ఆదానీ కార్పొరేట్ టాక్స్ సక్రమంగానే చెల్లిస్తున్నాడు !
అంతే కానీ మోడీజీ ఆదానీ కి పన్ను కట్టకుండా సహకరిస్తున్నాడు అనే ప్రచారం అబద్ధం !
***********************
చాలా తెలివిగా Underwriting,Write Off ,Waiver Off లాంటి పదాలకి ఒకే అర్ధం వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు శుంఠ లు.
Write -Off అంటే : బాంకులు ఇచ్చిన అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోలేని సందర్భంలో ఆ అప్పుని write – off చేస్తాయి అంటే దీనర్ధం అప్పు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన హామీ ని ఆధారం చేసుకొని చట్టపరంగా వేలం వేయడం లేదా కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా అప్పుని రాబట్టుకోవడం జరుగుతుంది అంతే కానీ write off అంటే ఋణ మాఫీ కాదు.
Waiver Off : అప్పు తీసుకున్న సంస్థ కానీ వ్యక్తిగతంగా అప్పు తీసుకున్న వాళ్ళు కానీ ఇక తిరిగి అప్పు తీర్చలేరు అని నిర్ధారించుకున్న తరువాత waiver off ని ప్రకటిస్తాయి అంటే దీనర్ధం బాంకులు ఇక చట్టపరంగా ఎలాంటి చర్యా తీసుకోవు అని. రైతులకి రుణాలు ఇచ్చి కరువు వల్ల రైతులు తిరిగి చెల్లించలేకపోతే ప్రభుత్వం ఆ అప్పులని waiver off చేస్తుంది అంటే ఋణ మాఫీ అన్నమాట.

2021 లో ఆదానీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరియు నవీ ముంబై ఎయిర్పోర్ట్ ని GVK గ్రూపు నుండి టేక్ ఓవర్ చేసింది అయితే ఇందుకు గాను 12,770 కోట్ల రూపాయల అవసరం ఏర్పడింది ఆదానీకి. ఆదానీ నేరుగా SBI ని అండర్ రైటింగ్ తీసుకోమని అడిగాడు దానికి SBI Underwriter గా ఉండడానికి ఒప్పుకుంది. SBI అండర్రైటర్ గా ఉంది కాబట్టి బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్, CLSA Ltd , HSBC హోల్డింగ్స్, కొటక్ మహీంద్రా,SBI మార్కెట్ కాపిటల్ కలిసి మొత్తం 12,770 కోట్ల రూపాయాలని GVK గ్రూపుకి ఇచ్చి రెండు ఎయిర్ పోర్ట్ లని ఆదానీ టేక్ ఓవర్ చేయడానికి అప్పు ఇచ్చాయి. ఇదంతా చట్టబద్ధంగానే జరిగింది కానీ అండర్ రైటింగ్ ని ఋణ మాఫీగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ట్విట్టర్ లో ట్వీట్ చేసింది అది కాస్తా వైరల్ అయ్యింది కానీ ఇంకా దానినే పట్టుకొని ఆదానీ అప్పుని ఎస్బిఐ మాఫీ చేసింది అంటూ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు.

Optimized by Optimole