దీదీకి ఓటమి భయం పట్టుకుంది : ప్రధాని మోదీ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీ ఓటమి భయం పట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరగణాల జిల్లాలోని జోయా నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీదీ ఓడిపోతానన్న భయంతో నందిగ్రామ్ లో తిష్ట వేశారని అన్నారు. ఓటమి తథ్యమని భావించిన మమతా మరో నియోజకవర్గంలో పోటీ చేసే విషయమే ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని…