షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో బెయిలు మంజూరు అయ్యింది. ఆర్యన్ తరపు న్యాయవాది గతంలో రెండు సార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆర్యన్ కు బెయిల్ లభించడంతో షారుఖ్ కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రగ్స్ కేసులో గత కొద్దిరోజులుగా ముంబయి అర్ధర్ రోడ్ జైలులో ఆర్యన్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో అతనికి బెయిల్ దొరకలేదు. దీంతో అతను 20 రోజులుగా జైల్లో ఉన్నాడు.గురువారం ఆర్యన్ బెయిల్ పై విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌కు అనుకూలంగా న్యాయవాదులు అమిత్ దేశాయ్, ముకుల్ రోహత్గీ న్యాయమూర్తి సాంబ్రే ముందు హాజరయ్యారు. అర్బాజ్ మర్చంట్ కేసుపై కోర్టులో పోరాడుతున్న లాయర్ అమిత్ దేశాయ్ ఆర్యన్ ఖాన్ బెయిల్‌కు అనుకూలంగా వాదనలు ప్రారంభించారు. మంగళవారం కూడా ఎన్‌సీబీ, ఆర్యన్‌ఖాన్‌ల న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.
ఇక ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని NCB తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. ముకుల్ రోహత్గీ ఆర్యన్ ఖాన్ అరెస్టును ప్రశ్నించారు. అర్బాజ్ మర్చంట్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్.. “మీరు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ మెమో చూడండి. అరెస్టుకు సంబంధించి ఎన్‌సీబీ వద్ద సరైన ఆధారాలు లేవు. చేయని నేరాలకు అరెస్టులు చేశారు. అర్బాజ్ నుంచి 6 గ్రాముల చరస్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. NCB తాను మాట్లాడుతున్న కుట్రను నిరూపించడానికి కోర్టు ముందు వాట్సాప్ చాట్ దాఖలు చేసింది. ఈ చాట్‌లకు అరెస్ట్‌కి ఎలాంటి సంబంధం లేదు. NCB ఈ సాక్ష్యం 65B కింద కోర్టులో చెల్లదు. ఫోన్ స్వాధీనం చేసుకోలేదు కానీ రిమాండ్ కాపీలో పేర్కొన్నారని ఆర్యన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.అనంతరం ఇరు వర్గాల తర్వాత ముంబై కోర్టు ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసింది.