ఆస్పత్రిలో చేరిన రజినీ..!

తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వారు వెల్లడించారు.కాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు రెండు రోజుల క్రితం రజినీ దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలుసుకున్నారు.