వై.యస్. వివేకానంద హత్య కేసు దృష్టి మరల్చేందుకే పట్టాభి అరెస్ట్: ఎంపి రఘురామ

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు పథక రచన చేసిన సూత్రధారులు ఎవరో తేలిపోయిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఈ హత్య వెనుక అల్టిమేట్ సూత్రధారులు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది తేలాల్సి ఉందని అన్నారు. హత్యకు పథక రచన చేసిన వారికి పెద్ద మొత్తం సొమ్మును ఏర్పాటు చేస్తామని ఎవరైనా గాడ్ ఫాదర్ చెప్పారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హత్య చేసిన వారు ముందే దొరికారని, ఇప్పుడు లెవెల్ వన్…

Read More

ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.“తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు.  వరంగల్  ప్రాంతానికి చెందిన వంగర బిడ్డ పీవీ నరసింహరావు దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేరన్నారు. నా మీద కోపంతో కొడంగల్ ను అభివృద్ధి చేయలేదనుకున్నా…..

Read More

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా సాగుతోంది : నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం  శరవేగంగా సాగుతోందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తల కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలబడాలనే సదుద్దేశంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని..బాధిత కుటుంబానికి 90 రోజుల్లోనే బీమా సాయం అందేలా…

Read More

వందే భారత్ రైలు – పాకిస్థాన్ ప్రేమికులు !

పార్థ సారథి పొట్లూరి: వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళు రువ్వడం వెనుక ఉన్న అసలు కారణం ! 1947 లో భారత్ నుండి పాకిస్థాన్ వేరుపడిన సందర్భంలో అప్పటికే బ్రిటీష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్లు,కట్టిన రైల్వే స్టేషన్లు భారత ఉప ఖండం మొత్తం మీద ఎలా ఉన్నాయో వాటిని సరిహద్దుల ప్రకారం పంచుకున్నాయి! ఇది చరిత్ర అందరికీ తెలిసిందే !PSP 1947 తరువాత భారత్ లో కానీ పాకిస్థాన్ లో కానీ చాల కాలం…

Read More

ఖేలో ఇండియా, ఖేలో ముద్దు…. పీలో ఇండియా, పిలావో వద్దు: బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ‘‘ఖేలో ఇండియా’’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. క్రీడల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. సమాజానికి ‘‘ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ ముద్దు… పీలో ఇండియా… పీలావో తెలంగాణ వద్దని’’ బండి పిలుపునిచ్చారు . బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్ర్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి…

Read More

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకు?: పవన్ కల్యాణ్

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఉలిక్కిపాటు ఎందుకని? ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలు జగన్ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవ చేశారు.ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న…

Read More

69 ఏళ్ల వయసులో కొత్త రికార్డు సృష్టించడానికి కేసీఆర్‌ పరుగులు..

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………………………. ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాపు అన్ని వర్గాల నేతలు, ప్రజలు చెప్పారు. అయితే, కేసీఆర్‌ ఎన్నో జన్మదినమో ఎవ్వరూ ఈ పత్రికా ‘ప్రకటనల్లో’ వెల్లడించలేదు. హైదరాబాద్‌ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు దాదాపు మూడేళ్ల ముందు (1954 ఫిబ్రవరి 17) మెదక్‌ జిల్లాలో జన్మించిన చంద్రశేఖర్‌ రావు గారే తనది ఎన్నో పుట్టినరోజో చెప్పవద్దని తన పార్టీవారిని…

Read More

జనసేన ప్రభుత్వంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం : నాదెండ్ల మనోహర్

పాలకుల్లో స్పందించే మనస్తత్వం లేనప్పుడు ఎన్ని సీట్లు తెచ్చుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్. ప్రభుత్వాలు కొత్తగా వ్యాపారాలు.. ఉపాధి అవకాశాలు సృష్టించకపోయినా ఉన్నవాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు, సంక్షేమ పథకాల విషయంలో చేతి వృత్తులను కులాల వారీగా విడగొట్టి పేదలకు లబ్ధి పొంద‌కుండా అన్యాయం చేశారని మండిప‌డ్డారు. హస్త కళాకారుల జీవితాలకు భరోసా లేకుండా చేసింది వైసీపీ పాలకులేని మ‌నోహ‌ర్…

Read More

వికారాబాద్ రాజ‌కీయ వీరుడెవ‌రు?

వికారాబాద్ లో స‌రికొత్త రాజ‌కీయానికి నేత‌లు తెర‌లేపారు. అధికార బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప‌నిపోయిదంటు సొంత పార్టీ నేత‌లే ధిక్కార స్వ‌రం వినిపిస్తుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న‌ ఉద్య‌మ‌కారులు మాపార్టీకి మేమే దిక్కంటూ దూసుకొస్తున్నారు. అటు కాంగ్రెస్ మాజీ మంత్రి ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. బీజేపీ అభ్య‌ర్థి సైతం రేసులో నేనున్నాంటూ త‌గ్గేదెలే త‌ర‌హాలో ప్ర‌చారంలో నిమ‌గ్న‌మ‌య్యారు. బిఆర్ఎస్ లో అధిప‌త్య పోరు.. వికారాబాద్‌ బీఆర్‌ఎస్‌ లో అధిపత్య పోరు…

Read More

కోటంరెడ్డి వెంటే జ‌నం.. మేము సైతం అంటూ వైసీపీ క్యాడ‌ర్‌…

నెల్లూరు: నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌ రాజ‌కీయం కాక‌రేపుతోంది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి బ‌య‌టికి వ‌చ్చాకా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌రుస‌గా ఆత్మీయ స‌మావేశాలు పేరిట ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైవుతున్నారు. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కి తోడు .. పార్టీల‌కు అతీతంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్నారు. సామ ,దాన‌,భేద దండోపాయ‌లు ఉప‌యోగించి ప్ర‌భుత్వం కార్పొరేట‌ర్లు,నేత‌ల‌ను అటు వైపు లాగేసుకున్న‌.. ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ క్యాడ‌ర్ ‘నీవెంటే మేము’ త‌ర‌హాలో మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం చూస్తుంటే .. ఈసారి…

Read More
Optimized by Optimole