Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

Ramojirao: రామోజీ గారు అన్న మాటలివి..!

Nancharaiah merugumala senior journalist: ‘ ఫస్ట్ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్ ‘…2007లో కలిసినప్పుడు రామోజీ గారు అన్న మాటలివి  ‘ఈనాడు’ సంస్థల్లో నేనెప్పుడూ రెగ్యులర్‌ ఉద్యోగిని కాదు, వారి పేరోల్స్‌ లో ఎన్నడూ లేను. ఇప్పుడు బతికి ఉన్నదో లేదో చెప్పడానికి వీలులేని తెలుగు డైలీ ‘వార్త’లో ఏ నెల జీతం ఏ తేదీన వస్తుందో తెలియని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నాకు– 2003లో ఆగస్టులో ఈనాడు జర్నలిజం స్కూల్‌ (ఈజేఎస్‌)లో…

Read More

Ramojirao:ఆయనో శిఖరం..చేసిందో యజ్ఞం..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: ‘మీరు ముఖ్యమంత్రి కావాలి సార్‌’ ఎంతో ఉత్సుకతో తన మనసు వెల్లడించిన ఓ సీనియర్‌ సబ్‌ఎడిటర్‌కి, తడుముకోకుండా బదులిచ్చారాయన. ‘ఏమయా, నేనిపుడు ఓ ముఖ్యమంత్రికన్నా తక్కువటయ్య?’ అని మనసారా నవ్వుతూ పలకడంతో ‘ఈనాడు’ ఎడిటోరియల్‌ నెలవారీ సమీక్ష సమావేశంలో నవ్వులు విరిసాయి. నిజమే, పలువురు ముఖ్యమంత్రులు గద్దెనెక్కడం, దిగడంలో అప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషించిన మీడియా మొగల్‌ రామోజీరావు. పొద్దుపొడుపుకు ముందే వాకిట వచ్చి వాలే… ఈనాడుతో తెలుగునాట ఒక…

Read More

EXITPOLLS2024: తెలుగు ఓట‌రు నాడిపై ఎగ్జిట్ పోల్స్‌ అంచ‌నాలు…ఎక్స్‌క్లూజివ్

EXITPOLLS2024: నేడు వెలువ‌డ‌నున్న తెలుగు రాష్ట్రాల( ఏపీ అసెంబ్లీ , పార్ల‌మెంట్‌.. తెలంగాణ పార్ల‌మెంట్‌) ఎన్నిక‌లకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది . వివిధ స‌ర్వే సంస్థ‌లు, మీడియా ఛాన‌ల్స్ విడుద‌ల చేసిన‌ ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలను newsminute24 ఎక్స్ క్లూజివ్ గా మీకోసం అందిస్తుంది.        AP ASSEMBLY EXIT POLLS- 2024                    …

Read More

EXITPOLLS2024 : తెలంగాణ లోక్ స‌భ‌లో బీజేపీ జోరు.. newsminute24 అంచ‌నా..!

Telangana:   తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు newsminute24 సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డ‌యింది . బీజేపీకి 8 నుంచి 12 స్థానాలు.. కాంగ్రెస్ కు 3 నుంచి 6 స్థానాలు.. .. బీఆర్‌ఎస్ కు 0-1, ఎంఐఎంకు 1 సీటువ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సంస్థ తెలిపింది. ప‌దేళ్లు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 1 పార్లమెంట్‌ స్థానం కూడా…

Read More

తెలంగాణ లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరి..పీపుల్స్ ప‌ల్స్‌ అంచ‌నా..!

EXITPOLLS2024: తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య నువ్వా , నేనా అనే పోరు న‌డిచిన‌ట్లు పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ వెల్ల‌డించింది. కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు.. బీజేపీ 6 నుంచి 8 స్థానాలు.. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 సీటు గెలుపొందే అవకాశాలున్నట్లు స‌ర్వేలో తేలింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 1 పార్లమెంట్‌ స్థానం…

Read More

Apolitical: ఎన్నికల్లో ‘నెటిజన్స్’ ఎవరి వైపు?

Social media: మన దేశ జనాభాలో 66 శాతం 35 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్. మిలీనియల్స్, జెన్ జీ గా పరిగణించే వీరిలో 98 శాతం మంది స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. వీళ్లు రోజూ కనీసం ఒక్క వీడియో అయినా చూసే జాబితాలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా స్మార్ట్ గా తయారయ్యాయి. సంప్రదాయ…

Read More

పక్కదారి పట్టిన ప్రచారం

నేను రెండో క్లాస్‌లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్‌ని ఒక విషయం అడిగినప్పుడు ‘గాడిద గుడ్డు’ అని విసుక్కున్నారు. అప్పుడు నాకు గాడిద గుడ్డు పెడుతుందా..? అనే సందేహం వచ్చింది. చిన్నతనంలో నాకు వచ్చిన సందేహమే ప్రస్తుతం నా పిల్లలకు కూడా వచ్చింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణలో మూడోసారి హోరాహోరీగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం పరాకాష్టకు…

Read More

Telangana: కాషాయమయమైన వేములవాడ, ఓరుగల్లు.. హోరెత్తిన మోదీ నినాదాలు..!

Pmmodi:  ప్రధాని మోదీ రాకతో రాజన్న సన్నిధానం వేములవాడ…పోరాటానికి పెట్టింది పేరైనా ఓరుగల్లు నగరం పులకరించింది. వీధులన్నీ కాషాయమయంగా మారాయి. రెండు పార్లమెంట్ నియోజాక వర్గాల్లో ఎక్కడ చూసినా.. మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. భారత్ మాతాకీ జై నినాదాలు హోరెత్తాయి. కారణ జన్ముడు మోడీని చూసేందుకు ప్రజలు  సభకు పోటెత్తారు. తాము ఆరాధించే నాయకుడిని చూసేందుకు జనాలు ఎండను సైతం లెక్కచేయకుండా మోదీ సభలకు పరుగులు తీశారు.  మీకు మేమున్నామంటూ.. దేశ రక్షణ కోసం మళ్ళీ…

Read More

భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా…. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు..!

Bandisanjay:  రిజర్వేషన్ల రద్దుపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు సవాల్ చేస్తున్నా…. ‘‘మేం ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను రద్దు చేయబోమని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఇక్కడున్న ప్రజలంతా దేవుడిమీద ప్రమాణం చేసి రిజర్వేషన్లు రద్దు కావని చెబుతున్నారు. మరి  ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని భగవంతుడి మీద ప్రమాణం చేసే దమ్ముందా కాంగ్రెస్ నేతలకు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో నిర్వహించిన…

Read More
Optimized by Optimole