రేవంత్ బ్లాక్ మెయిలర్.. ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెట్టె ఎన్నిక: రాజగోపాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాజగోపాల్. రాజకీయల్లోకి రాకముందు చిల్లర దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సోనియా గాంధీనీ బలిదేవత తో పోల్చిన వ్యక్తికి..అవినీతి పరుడికి పీసీసీ పదవి ఇవ్వడం దారుణమన్నారు. దొడ్డి దారిలో డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నాడని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇక తనను…

Read More

విమోచన దినోత్సవ నిర్వహణపై రాజకీయ రచ్చ

తెలంగాణలో విమోచన దినోత్సవ నిర్వహణపై రాజకీయ రచ్చ నడుస్తోంది. మజ్లిస్ కు భయపడి కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపిస్తే.. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం విమోచనం దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని టీపీసీసీ రేవంత్ ప్రశ్నించారు. మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ భేటిలో మూడు రోజుల పాటు తెలంగాణ విలీన దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అటు ఎంఐఏం అధినేత అసదుద్దీన్.. విమోచనం దినోత్సవం రోజును జాతీయ…

Read More

విమోచన దినోత్సవం నిర్వహణకు బీజేపీ సన్నాహాలు.. అమిత్ షా హాజరయ్యే అవకాశం..!!

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు.పార్టీలో చేరికలు , సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్న కమలనాథులు.. ఛాన్స్ దొరికితే చాలు అధికార టీఆర్ఎస్ నూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఊపులో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈకార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ముఖ్యఅతిధిగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది. గతంలో అనేక సార్లు తెలంగాణలో పర్యటించిన షా..అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం…

Read More

కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం.. ఘాటు కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్స్..

సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలంగాణ సంపదను కేసీఆర్ బీహార్ కు దోచిపెడుతున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే..అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ కాంక్షే సీఎం కేసీఆర్ లో కనబడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. జవాన్ల మరణాలకు కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాడని ఆయన తప్పు బట్టారు.సీఎం కేసీఆర్ మాటలు వినలేక నీతిష్ కుమార్ లేచి నిలబడ్డాడని.. తెలంగాణ నవ్వుల పాలు చేస్తున్నాడని…

Read More

ప్రధాని మోదీ భుజాలపై బొజ్జగణపయ్య.. అద్భుతం అంటున్న నెటిజన్స్..!

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేశ్ మహారాజ్ కి జై స్లొగన్స్ హోరెత్తుతున్నాయి. అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాధునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న రూపాలలో గణేశుడు దర్శనమిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రం హన్మకొండ లో బాల గణపతి యూత్ గుడిబండలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం…

Read More

స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ లో వర్గపోరు.. నేతలు సై అంటే సై..

స్టేషన్ ఘన్ పూర్ లో అధికార పార్టీ వర్గ పోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. స్టేషన్​ ఘన్​పూర్​ తన అడ్డా అని.. ఎవరినీ రానివ్వనంటూ రాజయ్య వ్యాఖ్యలు చేయడంతో .. నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామా అంటూ కడియం సవాల్​ విసిరారు. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే బయట తిరగలేవంటూ హెచ్చరించారు. దీంతో కడియం వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన రాజయ్య .. తన…

Read More

కాళేశ్వ‌రంపై త‌గ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని బిజెపి జాతీయ‌ నాయ‌క‌త్వంతో పాటు.. రాష్ట్ర నాయ‌క‌త్వం  గ‌త కొన్ని రోజులుగా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. సీఎం కేసిఆర్ కి కాళేశ్వ‌రం ఎటిఎం గా  మారిందని బీజేపీ నేతలు వివిధసభల్లో బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాలను పక్కా ఆధారాలతో  ప్ర‌జాకోర్టులో దోషిగా  నిల‌బెట్టెందుకు …

Read More

కేసీఆర్ పాదయాత్ర చేస్తే.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపేస్తా: సంజయ్

సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండిసంజయ్. అమిత్ షాను తాను గురువుగా భావిస్తానని.. గురు భక్తితోనే చెప్పలు జరిపానన్నారు. అతని మాదిరి గురువును కాలితో తన్నేలేదని మండిపడ్డారు. ఊసరవెళ్లి మాటలు ఆపి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ లేక రాష్ట్రంలో 31 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడి రైతులను వదిలేసి ..పంజాబ్ వెళ్లి..అక్కడి రైతులకు లక్షలు ఇచ్చాడని ఆగ్రహాం…

Read More

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై కమలం ఫోకస్..

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూడు విడతల యాత్రలు విజయవంతం కావడంతో.. నాలుగో విడత యాత్రకు భారీ ఎత్తులో ప్లాన్ సిద్ధం చేసేందుకు కమలం నేతలు సమయతమవుతున్నారు. పాద‌యాత్ర ఎక్క‌డ ప్రారంభించాలి? ఎక్క‌డ ముగించాలి అనే అంశాల‌పై సెప్టెంబ‌ర్ 2,3 తేదీల్లో  జిహెచ్ఎంసి, ఉమ్మ‌డి రంగారెడ్డి  ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో స‌మావేశం నిర్వ‌హించి తుదినిర్ణ‌యం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి….

Read More

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ సీఎస్ కు బండి లేఖ..!

కాళేశ్వరం ప్రాజెక్ట్  సందర్శనకు సెప్టెంబరు మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్   ప్రభుత్వ  ప్రధాన  కార్యదర్శి సోమేష్ కుమార్ కి  లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటునట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు . ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు.. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు  ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించి నిజానిజాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పర్యటన చేపట్టబోతున్నట్లు…

Read More
Optimized by Optimole