క్యాడర్ ను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్..

_ క్యాడర్ ను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్
_ చే…జారుతున్న కౌన్సిలర్లు
_ సర్జరీ తో దామన్న ఇంటికి పరిమితం
_ అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్
Suryapeta:  సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ క్యాడరు ను కాపాడుకోలేక సతమతమవుతుంది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలు గ్రూపులుగా ఏర్పడిన నాయకులు రోజుకు ఒక పంచాయతీని తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ముందట కొందరు సీనియర్ నాయకులు గొడవ పడిన సంగతి సామాజిక మాధ్యమాలు మీడియా ద్వారా చూశాం ఎంతమంది రాష్ట్ర ఇన్చార్జిలు మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం మారడం లేదు ఒకపక్క అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేస్తూ కొనసాగుతున్న పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలను ఒకటిగా చేసి భారతదేశ ఐక్యతను స్ఫూర్తిని చాటి చెబుతూ తన యాత్రను కొనసాగిస్తున్నారు దానికి మద్దతుగా రాష్ట్రంలో కూడా త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్రని చేస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రకటించిన సంగతి తెలిసింది అయితే ఇన్ని కార్యక్రమాల ద్వారా ఎలాగైనా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాటమే నాయకుల పనితీరు కొనసాగుతున్న సంగతి తెలిసింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉంది నియోజకవర్గంలో ఇద్దరు నాయకుల మధ్య క్యాడరు నలిగిపోతూ ఉంది కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాము కు కోపం అన్న చందంగా సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి తయారయిందని చెప్పుకోవచ్చు ఇరువురు నాయకులకు సఖ్యత సమన్వయం లేక క్యాడరు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వివిధ పార్టీలలోకి చేరుతున్నారు సూర్యాపేట మున్సిపాలిటీలో మొదటగా కాంగ్రెస్ పార్టీకి 15 మంది కౌన్సిలర్లు ఉండగా ఆరో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరింది ఆ తరువాత 27 వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరింది ఆ తరువాత 47 వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి కుంట్ల దేవిక ప్రభుత్వ ఉద్యోగం రావడంతో కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసింది తాజాగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ లో చేరారు ఇంకా కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది

ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల లో దామన్న..

మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ప్రస్తుతం తన రెండు మోకాలకు శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికే పరిమితమయ్యారు మునుగోడు ఉప ఎన్నిక తర్వాత డాక్టర్ ని సంప్రదించగా మోకాళ్ళకు శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు తెలపగా నెల రోజుల వ్యవధిలో రెండు మోకాలకు చికిత్స చేయించుకున్నారు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని తలంపుతో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ కేడర్ తెలిపింది ఇన్ని ఉన్న ఒకపక్క సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ కేడర్ కు దశ దిశ నిర్దేశం చేస్తూనే ఉన్నారు త్వరలో సూర్యాపేటలో కాంగ్రెస్ క్యాడర్ తో భారీ స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది ఈ సమావేశంలోనే దామన్న తన ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తాడని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

============

R.keshav (senior Journalist)