కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ పై వైద్య నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో.. కోవిడ్ తీవ్ర రూపం దాల్చకుండా కట్టడి చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అధికారాలు భావిస్తున్నారు.
కాగా ముంబయి, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్​, దిల్లీ సహా ప్రధాన నగరాల్లో ఈ పరీక్షలను చేపట్టేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగినట్లు సమాచారం. మరోవైపు కేంద్రం వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది.

Optimized by Optimole