ప్రభాస్ తో స్టెప్స్ వేయనున్న క్యాట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రతేక గీతంలో నటించనుందని టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ సదరు హీరోయిన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సాంగ్ కోసం భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. సాహో చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్టెప్పులేసిన ప్రభాస్.. ఇక ఇప్పుడు క్యాట్తో ఆడి పాడనున్నాడు. ఇప్ప‌టికే స‌గం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న స‌లార్ మూవీ.. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.