కోవిడ్ చికిత్స కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ , కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.తాజా మార్గదర్శకాలు ప్రకారం ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడానికి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కోవిడ్ ఉన్న లేకపోయిన ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్స అందించాలని పేర్కొంది. కోవిడ్ బాధితులకు సత్వర చికిత్స అందించడమే తమ ధ్యేయమని ఆరోగ్య శాఖ తెలిపింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు:
– కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు.
– కోవిడ్ లక్షణాలు లేకపోయిన ఆసుపత్రుల్లో జాయిన్ చేసుకొని చికిత్స అందిచాలి.
– ఎమెర్జెన్సీ సేవలను తప్పనిసరిగా అందిచాలి.
– నగరాలతో సంబంధం లేకుండా ఆసుపత్రుల్లో చేర్చుకోవాల్సిందే.
– కోవిడ్ రోగులకు తప్పనిసరిగా పడకలు కేటాయించాలి
– కోవిడ్ బాధితులకు సమగ్రమైన సత్వర చికిత్స అందించాలి.