బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్‌!

దేశంలో ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ మొద‌టి స్థానంలో నిలిచారు. కోవిడ్ లాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రాష్టాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరు గురించి ముంబైకి చెందిన ఆర్మాక్స్‌ మీడియా ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో న‌వీన్ ప‌ట్నాయ‌క్ 57 శాతం రేటింగ్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ 55 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ 44 శాతంలో 15 వ స్థానంలో.. కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, అస్సాం సీఎం సోనోవాల్ 54 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ 51 శాతంతో నాలుగో స్థానంలో.. బెంగాల్ ఫైర్ బ్రాండ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఐద‌వ స్థానంలో.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ ఆరో స్థానంలో ఉన్నారు. బీహ‌ర్ సీఎం నితిష్ కుమార్‌, మ‌హ‌రాష్ట సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే ఆత‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.