ఐపీఎల్ తాజా సీజన్లో చెన్నై జట్టు హ్యాట్రిక్ విజయలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకుంది. బుధవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 18 పరుగుల తేడాతో గెలిచి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(64; 42 బంతుల్లో 6×4, 4×6), డుప్లెసిస్(95; 60 బంతుల్లో 9×4, 4×6) రాణించారు. మొయిన్ అలీ(25; 12 బంతుల్లో 2×4, 2×6), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(17; 8 బంతుల్లో 2×4, 1×6)ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో నరైన్, రసెల్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ పడగొట్టారు. చెన్నై నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. పాట్ కమిన్స్(66 నాటౌట్; 34 బంతుల్లో 4×4, 6×6), ఆండ్రీ రసెల్(54; 22 బంతుల్లో 3×4, 6×6), దినేశ్ కార్తీక్(40; 24 బంతుల్లో 4×4, 2×6) ధాటిగా ఆడిన ఫలితం లేకపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చార్ నాలుగు, ఎంగిడి 3 వికెట్లు తీయగా సామ్‌కరన్ ఒక వికెట్ పడగొట్టారు.