బీజేపీ వీరాభిమాని మృతిపై యోగి సర్కార్ సీరియస్.. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశం!

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వీరాభిమాని బాబర్ హత్యపై సీఎం యోగి స్పందించారు. దారుణానికి పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాబర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు.. అత్యున్నత దర్యాప్తునకు అదేశిస్తునట్లు సీఎంవో ట్విట్ ద్వారా వెల్లడించింది.
ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబర్ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు.. ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడంతో కొంతమంది స్థానికులు కక్షకట్టి అతనిపై దాడి చేశారు.దీంతో అతను వారం రోజుల పాటు లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

మరోవైపు బాబర్ బీజేపీకి మద్దతు ఇవ్వడం మూలంగానే ఈ దారుణం జరిగిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Optimized by Optimole